Site icon HashtagU Telugu

Dadi Veerabhadrarao : టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..

Daadi Joins Tdp

Daadi Joins Tdp

వైసీపీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao)..నేడు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP) లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన తో పాటు తన కుమారులు, అనుచరులు ఇలా పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం…నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుండడం తో టికెట్ రాదని భావించిన నేతలంతా వరుసగా పార్టీ ని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి గుడ్ బై చెప్పి ..జనసేన, టీడీపీ లలో చేరగా..తాజాగా వైసీపీకి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao) సైతం నిన్న మంగళవారం పార్టీ కి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించడం జరిగింది. ఐతే గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ ఆహ్వానించారు. దీంతో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని అంత భావించారు. కానీ దాడి మాత్రం టీడీపీ వైపే మొగ్గుచూపించారు.

2014 వరకు దాడి వీరభద్రరావు టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు దాడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు పక్షాన చేరిన తర్వాత ఆయన పార్టీలో కీలక పాత్రను పోషించారు. ఈ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీ వీడి వైసీపీ లో చేరారు. కానీ ఇక ఇప్పుడు సొంత గూటికే రాబోతున్నారు.

Read Also : YS Sharmila Meets Jagan : కాసేపట్లో జగన్ ఇంటికి షర్మిల..

Exit mobile version