Dadi Veerabhadrarao : వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా..

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 04:22 PM IST

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం…నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుండడం తో టికెట్ రాదని భావించిన నేతలంతా వరుసగా పార్టీ ని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి గుడ్ బై చెప్పి ..జనసేన, టీడీపీ లలో చేరగా..తాజాగా వైసీపీకి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao) సైతం రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. గుడివాడ అమర్నాథ్‌ తో ఉన్న విభేధాలు.. వైసీపీ అధిష్టానం పట్టించుకున్నట్లు కనిపించకపోవడంలాంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. టీడీపీ (TDP)లో చేరాలా.. జనసేన (Janasena)లో చేరాలా అనే ఆలోచనలో దాడి అండ్ ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ ఆహ్వానించారు. దీంతో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని వినిపిస్తోంది. గతంలో టీడీపీ పార్టీలో ఉన్న దాడి వీరభద్రరావు.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును.. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్‌కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్‌కు కేటాయించారు. అయితే అక్కడ రత్నాకర్ ఓడిపోయారు. ఆ తర్వాత వారిని పార్టీ పక్కన పెట్టింది. అందుకే ఇప్పుడు వైసీపీ నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖకు సీఎం జగన్‌ను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు.

Read Also : Manakondur MLA : వైరల్ గా మారిన మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి పని వీడియో