ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లు.. 112, 1070, 1800 4250101. జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా: 08942-240557
విజయనగరం జిల్లా: 08922-236947
విశాఖపట్నం జిల్లా: 0891-2590102/100
అనకాపల్లి జిల్లా: 08924-222888
కాకినాడ జిల్లా: 0884-2356801
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:08856-293104
పశ్చిమగోదావరి జిల్లా: 08816-299181
కృష్ణా జిల్లా: 08672-252572
బాపట్ల జిల్లా: 08643-220226
ప్రకాశం జిల్లా: 9849764896
నెల్లూరు జిల్లా: 0861-2331261, 7995576699
తిరుపతి జిల్లా: 08770-2236007
తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.#Weather #Cyclone #AndhraPradeh #APSDMS #NDRF #SDRF #Rains #HeavyRains… pic.twitter.com/ieH91EaymD
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 27, 2025
ఏపీపై తుఫాన్ ప్రారంభం ప్రారంభం. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తుఫాన్ ముప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారులు తమ సెలవులను రద్దు చేశారు. ప్రజలకు సహాయం అందించడానికి ప్రభుత్వం రూ.19 కోట్లు కేటాయించింది. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించడానికి ఎస్డీఆర్‌ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, 16 శాటిలైట్ ఫోన్లను కూడా సిద్ధంగా ఉంచారు. తీర ప్రాంతాల్లో నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 57 తీర ప్రాంత మండలాల్లో 219 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. సముద్రంలో చేపలు పట్టే 62 మెకనైజ్డ్ బోట్లను సురక్షితంగా ఒడ్డుకు తరలిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం వరకు సెలవులు ఇచ్చారు.
పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో మంగళవారం వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు ఈరోజు సెలవులు ప్రకటించారు. తుఫాన్ ఎదుర్కోవడానికి విపత్తు బృందాలను జిల్లాల్లో మోహరించారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టడానికి 9 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. తుపాను కారణంగా ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లాలకు టీఆర్-27 కింద నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, ఆహారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
