Cyclone Asani: వాయువేగంతో దూసుకొస్తున్న ఆసాని తుపాన్…ఆంధ్రపై ప్రభావం..!

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Written By:
  • Updated On - May 8, 2022 / 12:37 PM IST

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రరాష్ట్రంపై ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రల్లో ప్రవేశిస్తుందని వాతవారణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీగా నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. ఆరోజు సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతలో ప్రవేశించి తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆసాని తుఫాన్ తీరం దాటే సమయంలో 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ధాటికి ఏపీ, బెంగాల్, ఒడివాలో భారీ వర్షాలు కురుస్తాయని…దీంతో అండమాన్ సహా ఒడిశా, బెంగాల్, సిక్కి,అస్సాం, ఏపీ, జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
బంగాళఖాతంలో ఏర్పడే తుఫాన్ లకు చుట్టూ ఉండే దేశాలు నామకరణం చేస్తాయి. ఈ సారి రాబోయే తుపాన్ శ్రీలంక పేరు పెట్టింది. ఆసాని అనే పేరును శ్రీలంక ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.