AP : ఏపీకి మరో తుపాను గండం..?

డిసెంబర్ 16 నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 12:38 PM IST

రీసెంట్ గా ఏపీని మిచౌంగ్ తుపాను (Cyclone Michaung) ముంచేసిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా చిత్తూరు , నెల్లూరు , కావలి ప్రాంతాల్లో పంటపొలాలకు భారీగా నష్టం వాటిల్లింది. రెండు రోజుల ముందు నుండే వర్షాలు తగ్గుముఖం పట్టడం తో రైతులంతా హమ్మయ్య అనుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ తెలిపి షాక్ ఇచ్చింది. డిసెంబర్ 16 నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది డిసెంబర్ 18 నాటికి అల్పపీడనంగా మారి క్రమంగా తుపాను (Cyclone Alert In Andhra Pradesh)గా, భారీ తుపానుగా పరివర్తనం చెందనుంది. ఈ తుపాను ఏపీ తీరం వైపుకు దూసుకొచ్చేందుకు 50 శాతం అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా డిసెంబర్ 21 నుంచి 25 వరకూ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవల వచ్చిన మిచౌంగ్ తుపాను కంటే ఇది తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను నేపధ్యంలో పంట కోత, నిల్వ, మిల్లులకు తరలించడం వంటి పనుల్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు.

ఇక మిచౌంగ్ తుపాను కారణంగా కురిసిన అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై సహా తమిళనాడుకు కూడా మరోసారి అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 2-3 రోజుసల్లో తమిళనాడులో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం కూడా తమిళనాడులోని తిరునల్వేలి, కూనూరులో, కేరళ వడవత్తూరులో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి.

Read Also : Ponguleti In Vijayawada : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పొంగులేటి