Site icon HashtagU Telugu

Drags : డ్రగ్స్ పేరుతో ..మహిళ ఉద్యోగి నుండి రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Fake Phone Call Cyber

Fake Phone Call Cyber

డ్రగ్స్ (Drags )..ఈ పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది..గత కొంతకాలంగా రహస్య ప్రదేశాల్లో ఈ దందా కొనసాగేది..అది కూడా బడా బాబులు , వారి కుమారులు, సినీ ప్రముఖులు మాత్రమే ఈ డ్రగ్స్ ను ఎక్కువగా వాడేది..కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది విచ్చలవిడి అయ్యింది. పబ్స్ నుండి మొదలుపెడితే పాన్ షాప్స్ ఆఖరికి స్కూల్స్ ముందు ఉండే కిరాణా షాప్స్ లలో సైతం ఈ డ్రగ్స్ అనేది లభ్యం అవుతుంది. దీంతో వయసు తో సంబంధం లేకుండా మహిళలు, మగవారు , చదువుకున్న వారు చదవు లేని వారు ఎలా ఎవరు పడితే వారు ఈ డ్రగ్స్ సేవిస్తూ..నేరాలకు పాల్పడుతున్నారు. ఈ డ్రగ్స్ మత్తులో ఏంచేస్తున్నారో కూడా అర్ధం కానీ స్థాయికి వెళ్లిపోతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ ఫై పోరాటం మొదలుపెట్టాయి. గత ప్రభుత్వాలు దీని విషయంలో నిర్లక్ష్యం వహించగా..ఈ రెండు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు మాత్రం డ్రగ్స్ అనేది లేకుండా చేయాలనీ చూస్తున్నాయి. డ్రగ్స్ అమ్మే వారు , తీసుకునే వారు ఇలా అందరిఫై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals ) డ్రగ్స్ పేరు ను వాడుకుంటున్నారు. మాములుగా ఫేక్ కాల్స్ చేసి బ్యాంకు అకౌంట్స్ , పిన్ నెం స్ అడిగి బ్యాంకు ఖాతాలో నుండి డబ్బులు ఖాజేసే వారు..కానీ ఇప్పుడు డ్రగ్స్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ భవానీపురం ఇదే జరిగింది. ఓ మహిళ ఉద్యోగికి సీఐ పేరుతో ఫోన్ చేసి మీరు డ్రగ్స్ లిస్ట్ ఉన్నారు..మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్‌ చేశారు. ముంబై నుంచి సైబర్ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె..ఇప్పుడు నేను ఏంచేయాలి అడిగింది. మీరు వెంటనే 32 లక్షలు ఇస్తే మీ పేరు లేకుండా చేస్తామని తెలిపారు. దీంతో ఆమె రెండు దఫాలుగా రూ.32 లక్షలు వారు చెప్పిన అకౌంట్ కు పంపించింది. ఆ తర్వాత ఇదంతా ఫేక్‌ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : Ration Card : రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్…

Exit mobile version