ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజి (Technology) ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చూసి గర్వపడాలో..లేక ఈ టెక్నలాజి ద్వారా సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ..సైబర్ నేరగాళ్లు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ దుష్కార్యాలకు ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి.
ఇటీవల సైబర్ నేరగాళ్లు సరికొత్త దందాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకు ఖాతాల నుండి డబ్బు దోచుకునే వారు..కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ లు చేయడం పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడడం..డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులను . ఆఖరకు పోలీసులను సైతం బెదిరిస్తూ వస్తున్నారు. తాజాగా విజయవాడ కు చెందిన యువతిని ఇలాగే మోసం రూ.1.25 కోట్లను కొట్టేసారు.
విజయవాడ (Vijayawada)కు చెందిన ఓ యువతి హైదరాబాద్ (Hyderabad)లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇటీవలే ఆమె తన తల్లిదండ్రులకు చూసేందుకు గురువారం విజయవాడ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీస్ (Mumbai Police) అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ (Drugs), ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని.. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించాడు. దీంతో కంగారు పడిన యువతి పలు దఫాలుగా కేటుగాడి అకౌంట్‌కు రూ.1.25 కోట్లు పంపింది. అనంతరం తాను మోసపోయినట్లుగా గ్రహించిశుక్రవారం రాత్రి సైబర్ క్రైం (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also : Anurag Kulkarni and Ramya Behra : పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన టాలీవుడ్ సింగర్స్