CWC meet in Hyderabad: కర్ణాటక సీఎంగా దళితునికి అవకాశం ఇవ్వాలని రేకెత్తిన వివాదానికి హైదరాబాద్ లో జరుగుతోన్న సిడబ్ల్యూసీ తెరదింపనుంది. ఇటీవల సీఎం సిద్ధిరామయ్యను ఎమ్మెల్సీ హరిప్రసాద్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అందుకు షోకాజ్ నోటీస్ ను హరిప్రసాద్ అందుకున్నారు. అయినప్పటికీ సిద్ది రామయ్య మీద రాజకీయ దాడిని ఆయన ఆపలేదు. దీంతో పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. అయినప్పటికీ దానికి ఫుల్ స్టాప్ పడలేదు. దీంతో సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతోన్న హరిప్రసాద్, సిద్దా రామయ్య మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కర్ణాటక పంచాయతీ హైదరాబాద్ కేంద్రంగా (CWC meet in Hyderabad)
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లేదా జమిలి ఎన్నికల మీద చర్చించే అవకాశం ఉంది. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీని ఓడించాలనే దూకుడను ప్రదర్శిస్తోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో మరింత బలోపేతం కావాలని ఆ రాష్ట్రం మీద ఆసక్తిగా ఉంది. అందుకే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేసిన వ్యాఖ్యలపై హరిప్రసాద్ అగ్రనేతలకు క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం.
కేబినెట్ మంత్రి కావాలన్న హరిప్రసాద్ ఆకాంక్ష
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్యవర్గ శాశ్వత సభ్యులు హరిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ, సిద్ధి రామయ్య తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులను పార్టీ హైకమాండ్ ఆహ్వానించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆహ్వానం అందింది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే. శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో కర్ణాటక పంచాయతీ హైదరాబాద్ కేంద్రంగా ఆసక్తిగా మారింది.
Also Read : జనసేన పొత్తు తో భయపడుతున్న టీడీపీ శ్రేణులు..ఎందుకంటే..!
కేబినెట్ మంత్రి కావాలన్న హరిప్రసాద్ ఆకాంక్షను సీఎం సిద్ధరామయ్య తుంగలో తొక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పటి సిద్ధరామయ్య నాయకత్వాన్ని హరిప్రసాద్ ప్రశ్నిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రకటనలు జారీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిణామానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది.
Also Read : CBN Vision Effect : చంద్రబాబు విలువ తెలుస్తోంది.! ప్రపంచ వ్యాప్తంగా నిరసన!!