Site icon HashtagU Telugu

Curtain Down:ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ థియేట‌ర్ మూసివేత‌.. !

V Epiq Cinema Imresizer

V Epiq Cinema Imresizer

ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ థియేట‌ర్ గా పేరుగాంచిన వి ఎపిక్ థియేట‌ర్ మూత‌ప‌డింది. ఈ థియేట‌ర్ సూళ్లూరుపేట జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే ఉంది. V-సెల్యులాయిడ్, UV క్రియేషన్స్ జాయింట్ వెంచ‌ర్ గా ఈ థియేట‌ర్ నిర్మాణం జ‌రిగింది. ఈ థియేట‌ర్ ని సుమారు 40 కోట్ల వ్య‌యం తో నిర్మించారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌లో టికెట్ రేట్లు త‌గ్గించ‌డం వ‌ల్ల ఈ థియేట‌ర్ భారీగా న‌ష్టాల‌ను చ‌విచూడాల్సి వ‌స్తుండ‌టంతో థియేట‌ర్ ని తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.వి ఎపిక్ థియేట‌ర్ పంచాయతీ పరిధిలోకి రావ‌డంతో నిర్వహణ ఖర్చులను కూడా రావ‌డం లేద‌ని యాజ‌మాన్యం తెలిపింది. SLS సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్టర్‌తో ఈ స్ర్కీన్ ని ఏర్పాటు చేశారు. అయితే యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యం ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచింది. ఈ న్యూఇయ‌ర్ కి చాలా మంది ఈ బిగ్ స్క్రీన్ థియేట‌ర్ లో సినిమాలు చూడోచ్చ‌ని అంద‌రు భావించారు. కానీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో యాజ‌మాన్యం థియేట‌ర్లు న‌డ‌ప‌లేమ‌ని మూత‌వేసింది.

Exit mobile version