Lockdown : ఏపీలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. ఆ న‌గ‌రంలో క‌ర్ఫ్యూ

విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు.

Published By: HashtagU Telugu Desk

విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు. ఓ యువకుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో ఆదివారం సాయంత్రం నుండి అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా బాధితుని ఇంటి పరిసరాల్లో చుట్టూ కిలోమీటర్ మేర వీధులన్నింటినీ మున్సిపల్ అధికారులు బారికేడ్లతో మూసేశారు. ఐరన్ మెష్‌లు, ఐరన్ రాడ్ల సాయంతో పలువీధుల్లో రాకపోకలు నివారించారు. రాయల్ హోటల్ సెంటర్, జెండాచెట్టు సెంటర్, గులాబీ వీధి, డ్రైన్ వీధి, దూది ఫ్యాక్టరీ సందు, కోమల విలాస్ సెంటర్, రమణయ్య కూల్ డ్రింక్స్ సెంటర్, ఆర్‌ఆర్ అప్పారావు వీధి, హిందూ హైస్కూల్ ఎదురు రోడ్డు, ఇలా అన్ని దిక్కుల్లోని వీధులనూ మూసేశారు. కిలోమీటర్ పరిధిలో ఎవ్వరూ సంచరించకూడదని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించగా పాతబస్తీలో ఆదివారం సాయంత్రం నుండి ఈ నెల 31వరకు కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. ఈప్రాంతం ఆసాంతం తమ ఆధీనంలో ఉంటుందని, ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆరుగురు డిప్యూటీ ఇంజనీర్లు, ఒక సూపరిటెండెంట్ ఇంజనీరు, ఈఈ ఇన్‌చార్జి నారాయణమూర్తి, డీఈలు రవికుమార్, రంగారావు, ఏఈలు రవీంద్రకుమార్, శాంతికుమార్, రాజేష్, తదితరులు రేయింబవళ్లు విధులు నిర్వహించనున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ మరియన్న వివరించారు.

 

  Last Updated: 29 Nov 2021, 10:32 AM IST