మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Y.S. Vivekananda Reddy Murder Case) కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని (Driver Dastagiri) సీబీఐ కోర్టు (CBI COurt) నిందితుల జాబితా నుంచి తొలగించింది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా.. ఈ కేసులో తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. అలాగే వివేకా హత్య కేసులో సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే సమయంలో సీబీఐ కూడా తనను అభియోగపత్రంలో సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక నుండి వివేకా హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా మాత్రమే పరిగణించనున్నారు. ఏపీలో సంచలనం రేపిన ఈ కేసులో ఐదేళ్లు జైల్లో ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న దస్తగిరి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. 15న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో మృతుడి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నెం. 84/2019 గా పులివెందుల పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో మలుపులు నడుస్తూనే ఉన్నాయి. మరి దీనికి ఎప్పుడు ముంగిపు వస్తుందో చూడాలి.
Read Also : Madanapalle Incident : రాజకీయాలు వదిలేస్తా..ఎంపీ మిథున్ రెడ్డి సంచలన ప్రకటన