ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో మరోసారి వేడెక్కుతున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన ఆదేశాలు చిత్తూరు జిల్లా రాజకీయాలను హడలెత్తిస్తున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి (Peddireddy ) రామచంద్రా రెడ్డి కుటుంబ సభ్యులపై అటవీ భూముల అక్రమ కబ్జా ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఫామ్‌హౌస్‌లు నిర్మించేందుకు అనుమతి లేకుండా అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Foreign Players: ఐపీఎల్ రీషెడ్యూల్.. ఐపీఎల్‌కు దూరం అవుతున్న విదేశీ ఆటగాళ్లు వీరే!
ఈ కేసులో కేవలం పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే కాదు, వారి అక్రమ చర్యలను అడ్డుకోలేకపోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పదవీ అడ్డుపెట్టుకొని పెద్దిరెడ్డి ఎన్నో అక్రమాలు చేసాడని ప్రచారం జరుగుతున్న వేళ…ఇప్పుడు వరుస కేసులు ఆయన్ను ఇబ్బంది పెట్టెల ఉన్నాయని అంత భావిస్తున్నారు.. పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసే అవకాశం ఉండడం తో పవన్ కళ్యాణ్ ముందస్తు బెయిల్ రాకుండా అడ్డుకుంటారా లేదా అనేది చూడాలి.