AP : సజ్జలపై క్రిమినల్ కేసు

వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు

Published By: HashtagU Telugu Desk
Sajjala

Sajjala

వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్ కేసు నమోదు అయింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీ లోని u/s 153,505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ అగ్రనేతలు కౌంటింగ్ ఏజెంట్ల అవగాహనా సదస్సు నిర్వహించారు సజ్జల. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ఇదే మన లక్ష్యం అని భావించి.. దీనికి ఏం అవసరమో తెలుసుకోవాలి.. ఇతరులు (ప్రతిపక్ష పార్టీలు) జోక్యం చేసుకోకుండా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూడండి.. వారు అడ్డుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం చూడాలి. అలా కాకుండా ఒక్క ఓటు కూడా చెల్లుబాటు కాకుండా పోతుందని, ఏదైనా సమస్య వచ్చినపుడు అది రూల్ అని చెప్పి మాట్లాడకుండా వదిలివేయకూడదు. అలాకాకుండా పోరాటం చేసే ఏజెంట్లే కావాలి. ఈ విషయంలో మీరు (ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లు) వారికి (కౌంటింగ్ ఏజెంట్లకు) పోరాటం చేసే విధానం నేర్పాలి. పోరాటం చేయగలిగిన కౌంటింగ్ ఏజెంట్లే మనకు అవసరం. అలా చేయలేని వారు మనకు వద్దు.” అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కౌంటింగ్ ఏజెంట్స్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ సజ్జలను అరెస్ట్ చేయాలని కోరుతూ టీడీపీ పార్టీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు తో పోలీసులు సజ్జల ఫై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Read Also : Warning Signals For India: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన బ్రియాన్ లారా.. ఎందుకంటే..?

  Last Updated: 31 May 2024, 10:32 AM IST