మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తన మార్క్ చూపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రానికి (AP) పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకరావడం..ఏపీని ఐటీ హబ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుస విదేశీ పర్యటనలు చేస్తూ ఎన్నో సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. తాజాగా అసెంబ్లీ లో రాష్ట్రంలో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు (5 lakh IT jobs) కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపి నిరుద్యోగ యువతలో సంతోషం నింపారు.
విశాఖను ఐటీ (Vizag IT hub) కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ, డేటా సెంటర్ల స్థాపన, గ్లోబల్ కంపెనీలతో ఒప్పందాలు, మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని చర్యల కారణంగా నష్టపోయిన ఐటీ రంగాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్యలో వచ్చిన 150 కంపెనీలతో 50,000 మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. విశాఖను డేటా సెంటర్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని, అదానీ డేటా సెంటర్, ఇతర సంస్థలతో చర్చలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ కేబుల్ మరియు నిక్సీ విశాఖకు రావడం పై కృషి చేస్తున్నామని , భారత్‌లోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, టూరిజంను ఇండస్ట్రీగా గుర్తించి కొత్త పాలసీ ప్రవేశపెట్టడం. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలతో ఒప్పందాలు వంటివి జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఐదు ఏళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను విశాఖకు రప్పించేందుకు కొత్త పాలసీలు రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also : Pregnancy : మహిళల్లో అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? వాసెక్టమీ లేదా కాపర్-T..!