CM Jagan: అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవసభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పదే పదే చెప్పారు. గెలిచిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. గెలిచి నాలుగున్నరేళ్లు దాటింది. ఇచ్చిన హామీని అమలు చేయలేని జగన్ కు రానున్న ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొంగలి అప్పలరాజు, కరిమి రాజేశ్వరరావు అన్నారు. జగన్ గెలుపునకు దండం పెట్టారన్నారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా చూసే వరకు ప్రతి ఉద్యోగి పోరాడుతామన్నారు. సభకు జిల్లా అధ్యక్షుడు గాడి సూర్యప్రకాష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న వారందరూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, విజయనగరం జిల్లా కోశాధికారి ఎస్.అప్పలనాయుడు, అనకాపల్లి మండల గౌరవాధ్యక్షుడు బి.శ్రీనివాస్ వేదికపై గుండు కొట్టించుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోటూరు త్రినాథస్వామి మెడలో చెప్పుల దండతో కొట్టారు. కొందరు గాజులతో అడుక్కున్నారు.
Also Read: Goods train Accident: పట్టాలు తప్పిన సరుకు రవాణా రైలు