AP : ఏపీ పోలీసులు.. వైసీపీ కాపలా కుక్కలు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు

Published By: HashtagU Telugu Desk
Cpi Ramakrishna

Cpi Ramakrishna

మే 13 న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (Ap Elections) జరిగిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ కు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సామాన్య ప్రజలే కాదు అన్ని రాజకీయ పార్టీల నేతలు సైతం వీటి కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటె పోలింగ్ రోజు రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ రోజు మొదలుపెడితే ఇప్పటికే పలు చోట్ల పోలీసుల భద్రతలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వసం చేయడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన ఫై యావత్ ప్రజానీకం తప్పు పడుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా చేస్తే ఎలా అంటున్నాయి. తాజాగా దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి (CPI Ramakrishna) స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, పోలీసులు వైసీపీ కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బదిలీ, సస్పెండ్ అయిన వెధవలు ఖాకీ డ్రెస్ లు వేసుకోవడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులు అని దుయ్యబట్టారు.

Read Also : Jay Shah: అవ‌న్నీ అవాస్త‌వం.. కోచ్ ప‌ద‌వి కోసం వారిని సంప్ర‌దించ‌లేదు: జై షా

  Last Updated: 24 May 2024, 03:22 PM IST