Jagananna Bhu Raksha Scheme : జగన్ను ఓడించబోయేది ఇదే – CPI నారాయణ

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 10:52 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదేళ్ల తర్వాత విజయడంఖా మోగించి బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతున్నట్లు పలు సర్వేలు..పలు పార్టీల నేతలు , రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. తెలంగాణ లో కేసీఆర్ (KCR) ఓడిపోవడానికి కారణం..ధరణి అయితే..ఏపీలో జగన్ ఓడగొట్టేది భూరక్ష పథకం (Jagananna Bhu Raksha Scheme) అని తేల్చి చెప్పారు సీపీఐ నారాయణ (CPI Narayana). ఈ పథకంలో ఎన్ని లోపాలు ఉన్నాయో క్లారిటీ గా చెప్పుకొచ్చారు.

జగన్ సర్కార్ (Jagan Govt) .. ‘భూరక్ష పథకం’ పేరుతో భూములు రీసర్వే చేసి ఓ పాస్ పుసక్తం అందజేస్తుంది. వైఎస్‌ జగన్‌ ఫొటోతో కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. పట్టాదారు పుస్తకంపైన యజమాని ఫోటో లేదా..ప్రభుత్వ ఫోటో ఉంటుంది కానీ.. జగన్‌ మాత్రం తానేదో ఈ భూమికి యజమాని అయినట్లు ఆయన ఫొటో వేసుకొని ఖాతాదారులకు ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు..పంటపొలాల్లో హద్దురాళ్ల ఫై జగనన్న భూరక్ష పథకం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో హద్దురాళ్లు ఏర్పాటు చేసాడు. ఇలా కొన్ని వందల కోట్ల ఖర్చు ఈ పథకానికి ఖర్చు చేసాడు. దీనివల్ల భూ యజమానికి ఏమైనా ఉపయోగం అంటే ఏమిలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సర్వే చేసేందుకు రైతుల నుంచి అనుమతి తీసుకోకపోగా.. ఎలాంటి సమాచారం లేకుండా వారిపాటికి వారు రైతుల పొలాలను సర్వే పూర్తి చేశారు. సీఎం జగన్‌ ఫొటోలతో జగనన్న భూ హక్కు పత్రం, భూయాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం పేరుతో పుస్తకాలు సిద్ధం చేశారు. రీసర్వేలో తమ భూములు తగ్గిపోయాయని తెలుసుకున్న రైతులు ఈ పుస్తకాలను తీసుకోకుండా అభ్యంతరం చెప్పారు. అయినా సరే.. మగవారు ఇళ్లలో లేని సమయంలో రెవెన్యూ అధికారులు వీఆర్‌ఏల చేత పట్టాదారు పుస్తకాలు పంపించి ఆయా రైతుల కుటుంబాలకు అందజేశారు. ఇక జగన్ ఇచ్చిన పట్టపుస్తకం దేనికైనా పనికొస్తానుందా అంటే నాలుక గీసుకోడానికి కూడా పనికిరాదని నారాయణ చెప్పుకొచ్చాడు. ఈ పట్టపుస్తకం ద్వారా భూమి రిజిస్టర్ చేసుకోవడానికి కానీ , బ్యాంకు లోన్ తీసుకోవడానికి కానీ కుదరదని పుస్తకంలో పేర్కొన్నారు. అంటే ఈ పుస్తకం దేనికి పనికిరాదని ప్రభుత్వమే చెపుతుంది. జస్ట్ జగన్ పబ్లిసిటీ కి తప్ప దేనికి పనికిరాదని వారే చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు , ఆ తర్వాత ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన పాస్ పుస్తకాల్లో అన్ని హక్కులు పొందుపరిచి..అన్ని బ్యాంకు లోన్ లకు అర్హులే అని చెప్పడం జరిగింది. కానీ జగన్ ఇచ్చిన పుస్తకాలు మాత్రం దేనికి పనికి రావని ..కనీసం బ్యాంకు లోన్ కు కానీ , భూమి రిజిస్టేషన్ కు కానీ దేనికి పనికిరావని ప్రభుత్వమే చెప్పింది. ఇలాంటిదే తెలంగాణ లో కెసిఆర్ చేసాడు. ధరణి పేరుతో పట్టపుస్తకాలు ఇచ్చి రైతులను ఆగం చేసాడు. వారంతా కొంత భూమి కోల్పోయేలా చేసాడు. ఆ దెబ్బె ఎన్నికల్లో పడింది..ఇప్పుడు జగన్ను కూడా అదే దెబ్బ తీయబోతుంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించేది ఈ పథకమే అని నారాయణ చెప్పుకొచ్చారు.

Read Also : Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో మరోసారి రెచ్చిపోయిన బుల్డోజర్లు