తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!

ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ  ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - October 6, 2021 / 04:16 PM IST

ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ  ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నాయి. ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి ఆలయ నిర్వాహకులు కూడా కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ చేయించుకున్న సర్టిఫికెట్.. లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్న రిపోర్ట్.. రెండింట్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.

తిరుమలలో తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 7 నుంచి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల గ్యాదరింగ్ వల్ల మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు టీకాలు తీసుకొని ఉండాలని, లేదంటే కోవిడ్ -19 నెగిటివ్ రిపోర్ట్ అయినా అందించాలని టీడీపీ స్పష్టం చేసింది. వివిధ ప్రాంతాల నుంచి  వేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులను అలిపిరి వద్దే నిలిపివేస్తామని, ప్రతిఒక్కరినీ టెస్టు చేసిన తర్వాతనే కొండపైకి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. సామాన్యులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది.

కలియుగంలో భక్తులను రక్షించేందుకు సాక్షాత్తూ విష్ణుమూర్తే… వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా ఏడుకోండల్లో కోలువైయున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు. అందుకే శ్రీవారిని శ్రీనివాసుడుగా, తిరుమలేశుడుగా, వెంకటేశ్వరుడిగా. ఆపదమొక్కులవాడుగా, సప్తగిరీశుడుగా, గోవిందుడుగా ఇలా అనంతమైన పేర్లతో భక్తులు స్వామివారిని కొలుస్తారు. అందుకే తిరుమలేశుని కోవెల నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రసిద్ది గాంచింది. ప్రతి రోజుకు దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులు అవుతుంటారు. సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది.