Site icon HashtagU Telugu

Covid Positive Cases : వైజాగ్‌లో ప‌దికి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు

Corona Virus India Covid19

Corona Virus India Covid19

విశాఖపట్నంలో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. శనివారం నాటికి మొత్తం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.శుక్రవారం పరీక్షించిన 21 నమూనాలలో ఆరు పాజిటివ్‌గా వచ్చాయని.. శనివారం 24 శాంపిల్స్‌ను పరీక్షించగా నాలుగు పాజిటివ్‌గా తేలిందని కెజిహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే 10 పాజిటివ్ కేసులు ప్రభావితం చేసిన వైరస్ కొత్త JN1 వేరియంట్ కాదా అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈ రోగుల రక్త నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడ్డాయని.. వాటి ఫలితాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కోవిడ్ కేసులను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ఆక్సిజన్ బెడ్‌లతో కూడిన ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పారిశుద్ధ్య కార్మికులతో నిత్యం క్లీనింగ్‌ కార్యక్రమాలతో పాటు బ్లీచింగ్‌, ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ వంటి చర్యలు చేపట్టాలని జివిఎంసి అధికారులను మేయర్‌ కోరారు. ప్రతి ఇంటిలో జ్వరపీడితులపై తనిఖీలు చేసేందుకు సచివాలయ స్థాయిలో ఇంటెన్సివ్ సర్వేలు చేపట్టాలని ఏఎన్‌ఎంలు, ఆశాలను వెంకట కుమారి కోరారు. వైర‌స్ సోకిన వ్యక్తులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ ధృవీకరించారు. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని జోన్ కమిషనర్లు, AMHO లను ఆదేశించారు.

Also Read:  CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్