Site icon HashtagU Telugu

CM JAGAN : ఏపీ సీఎంకు సీబీఐ షాక్…పారిస్ టూర్ కు నో పర్మిషన్..!!

Jagan mohan reddy

Jagan mohan reddy

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది సీబీఐ. జగన్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తాజాగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం జరిగిన విచారణలో సీబీఐ…జగన్ విదేశాలకు వెళ్లినట్లయితే…ఆయనపై నమోదైన కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని వాదిస్తూ అనుమతులు ఇవ్వద్దంటూ వాదించింది.

పలు కారణాలు చూపిస్తూ…జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారని…ఈ కారణంగా జగన్ను విదేశీ పర్యటనకు అనుమతించరాదంటూ..సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కుమార్తె పారిస్ లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ ఆమె విద్యాభ్యాసం ముగియడంతో…కళాశాలకు సంబంధించిన స్నాతకోత్సవం త్వరలోనే జరగునుందట. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే తాను పారిస్ వెళ్లాల్సి వస్తుందని చెప్పిన జగన్…అందుకు అనుమతివ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం నాటి విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.