Countdown : అవినీతి వ్య‌తిరేక ఎజెండా! ఉద్యోగుల‌కు జ‌గ‌న్ కౌంట్ డౌన్!

జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ ఏపీలోని టీచ‌ర్లు ఉద్యోగుల‌కు మ‌రువ‌లేని(Countdown) రోజు.

  • Written By:
  • Publish Date - December 31, 2022 / 02:32 PM IST

జ‌న‌వరి ఒక‌టో తేదీ ఆంగ్ల‌మాన పండుగ‌. క్రిస్మ‌స్ నుంచి ఒక‌టో తేదీ వ‌ర‌కు క్లిస్టియ‌న్లకు సంద‌డే సంద‌డి. ప్ర‌త్యేకించి 2023, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ ఏపీలోని టీచ‌ర్లు ఉద్యోగుల‌కు మ‌రువ‌లేని(Countdown) రోజు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ చ‌రిత్ర‌లో జ‌రగ‌ని అద్భుతం ఈ జ‌న‌వ‌రి ఒకటో తేదీన జ‌ర‌గ‌నుంది. ఆ రోజు నుంచి ఉద్యోగులు టైమ్కు  విధిగా విధుల‌కు హాజ‌రు కావాలి. ప‌ది నిమిషాలు లేటైనా జీతం క‌ట్ చేసేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు, ఉద్యోగస్తులు(Teachers) కార్యాలయాల్లో ఉన్నప్పుడు రూ. 500 నుంచి రూ. 1000 మాత్రమే ఉంచుకోవాలి. లేదంటే క‌ఠిన చ‌ర్య‌ల‌కు (Countdown)     సిద్ధ‌ప‌డాల‌ని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన పెద్ద సాహ‌స‌మ‌ని చెప్పుకోవాలి.

టీచ‌ర్లు ఉద్యోగుల‌కు మ‌రువ‌లేని(Countdown) రోజు

సాధార‌ణంగా ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ఏదైనా ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముందుగా ప్ల‌స్, మైన‌స్ పాయింట్ల‌ను అంచ‌నా వేసుకుంటారు. టీచ‌ర్లు,(Teachers) ఉద్యోగుల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న `ముఖ గుర్తింపు`(ఫేసియ‌ల్ రికగ్రైజేష‌న్‌) నిర్ణ‌యం కూడా అంతే. ఆయ‌న ఎంత వ‌ర‌కు ఆ నిర్ణ‌యం ప్ల‌స్ కానుంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా ఉంది. పైగా ఇటీవ‌ల ఉద్యోగుల‌కు న‌చ్చ‌ని విధంగా తీసుకుంటోన్న నిర్ణ‌యాలు ఆయ‌న్ను గ‌ద్దె దించుతాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లెక్క‌లు వేరే ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. అందుకే, ఏపీ చ‌రిత్ర‌లో ఇంత వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సాహ‌సాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. రాబోవు రోజుల్లో ఎన్నిక‌ల్లో ఈ కీల‌క నిర్ణ‌యాలు బాగా క‌లిసొస్తాయ‌ని అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Ap Employees : ఏపీ ఉద్యోగుల నోటి దురుసు! కూలీలు అంటే అంత అలుసా.!

ఏపీలోని ఉద్యోగులు, టీచ‌ర్ల చ‌రిత్ర‌ను చూస్తే, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాల‌ను శాసించిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గిన విధంగా `ప్ర‌భుత్వాల‌ను కూల్చుతాం, నిల‌బెడ‌తాం..అంటూ ఇటీవ‌ల ఉద్యోగుల సంఘం నాయ‌కుడు శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో కూలీలను కించిపరుస్తూ వాళ్ల‌ కంటే హీనంగా ఉన్నామ‌ని బీద అరుపులు వినిపిస్తున్నారు. ఆ మేర‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాళ్ల మెడ‌ల‌ను వంచారు. గొంతెమ్మ కోర్కెలు కుద‌ర‌వ‌ని చెప్పేశారు. టీచ‌ర‌క్లు, ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వేసిన మంత్రుల స‌బ్ క‌మిటీ ప‌లు అంశాల‌ను ఇటీవ‌ల ప్ర‌స్తావించింది. సీపీఎస్ ర‌ద్దు కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పింది. దాని స్థానంలో జీపీఎస్ ఇస్తామ‌ని తేల్చింది. కోర్టు వెళితే, ఏమ‌వుతుంది? అనేది తెలుసుగా? అంటూ మంత్రి బొత్సా ఉద్యోగుల‌కు చుర‌క‌లు వేశారు. పీఆర్సీ వేయ‌డానికి అనుకూల‌మైన పరిస్థితులు లేవ‌ని ప‌రోక్షంగా ఆయ‌న చెప్పేశారు. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగులు కిక్కురుమ‌న‌కుండా ఉన్నారు.

ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెల‌కు క‌ళ్లెం

ప్ర‌స్తుతం బ‌డ్జెట్ లో 70శాతానికి పైగా వాటా ఉద్యోగుల జీతాలు, భ‌త్యాల‌కు వెళుతోంది. రాష్ట్రాభివృద్ధికి నిధుల‌ను కేటాయించే ప‌రిస్థితి లేకుండా జీతాల‌కు రెవెన్యూలోని సింహ‌భాగం వెళ్లిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎంలు అంద‌రూ ఎవ‌రికివారే జీతాల‌ను పెంచుకుంటూ ఓట్ల రాజ‌కీయాన్ని న‌డిపారు. తొలిసారిగా సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెల‌కు క‌ళ్లెం వేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాస్త‌వంగా ఏడాది క్రితం జీతాల‌ను పెంచ‌డం ద్వారా సుమారు 11వేల కోట్ల రూపాయ‌ల భారాన్ని ప్ర‌జ‌ల భారం ప‌డింది. మ‌ళ్లీ ఇప్పుడు పీఆర్సీ వేయాల‌ని ఉద్యోగులు ప‌ట్టుబ‌ట్టారు. దీంతో వాళ్ల ఆలోచ‌న‌ను ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుగా టీచ‌ర్ల‌ను క‌ట్ట‌డీ చేస్తూ బోధ‌నేత‌ర విధుల నుంచి వాళ్ల‌ను త‌ప్పించారు. ఇప్పుడు స‌చివాల‌య‌, ఇత‌ర విభాగాల ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్టేలా బ‌యో మెట్రిక్ బ‌దులుగా ఫేస్ రిక‌గ్రైజేష‌న్ ప‌ద్ధ‌తిని తీసుకొచ్చారు.

Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం!

జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమ‌లు చేయ‌బోయే `ముఖ గుర్తింపు` జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఉద్యోగుల‌కు ఆగ్ర‌హం క‌లిగించ‌డం స‌హ‌జం. ఆ విష‌యం ఆయ‌న‌కు తెలియ‌న‌ది కాదు. వాళ్లు రోడ్ల మీద‌కు వ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తార‌ని కూడా ఆయ‌న‌కు తెలుసు. ఆ పరిణామం సామాన్యుల నుంచి ప్ర‌భుత్వానికి సానుకూల‌త తెప్పించేలా ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే, రాష్ట్రంలో ఉద్యోగుల అవినీతి పెరిగింది. ఆ విష‌యం టోల్ ఫ్రీ నెంబ‌ర్ ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలుసుకున్నారు. అవినీతి ర‌హిత పాల‌న అందించాల‌ని ఆయ‌న తొలి నుంచి చెబుతున్నారు. కానీ, ఉద్యోగుల నుంచి స‌హ‌కారం లేక‌పోగా, ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డానికి ఉద్యోగులే కార‌ణ‌మ‌ని భావిస్తున్నార‌ట‌. స‌మాజంలోని 95 మంది ప్ర‌జ‌లు ఉద్యోగులను వ్య‌తిరేకిస్తున్నారని తాజా స‌ర్వే సారాంశ‌మ‌ట‌. అందుకే, ఉద్యోగుల అవినీతి వ్య‌తిరేక ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ చూస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : YS Jagan Vs Employees: జ‌గ‌న్ దెబ్బ‌కు ఉద్యోగుల విల‌విల‌!