AP Corona:ఏపీలో కరోనా విభృంభణ

సంక్రాంతి ఎఫెక్ట్‌ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్‌ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:12 PM IST

సంక్రాంతి ఎఫెక్ట్‌ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్‌ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.

సంక్రాంతి కోసం పట్టణాల నుంచి పల్లెలకు జనం వెళ్లిన ఎఫెక్ట్‌ ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి మొదలైన కొద్దిరోజులకే పెద్ద పండుగ వచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం లక్షల మంది పల్లెలకు వెళ్లి వచ్చేశారు. తెలంగాణలో స్కూళ్లకు సెలవులను పొడిగించడంతో కొంతమంది ఏపీలో ఉండిపోయారు. పైగా పండగ రోజుల్లో కోడిపందాలు, సంబరాల్లో లక్షల మంది ఎంజాయ్‌ చేశారు. చాలా చోట్ల కనీసం ఆంక్షలు పాటించలేదు. దాని ఎఫెక్ట్‌తో ఏపీలో తాజాగా 6,996 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 38 వేల 55 మందిని టెస్ట్‌ చేస్తేనే ఇంత మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే 18 శాతానికిపైగా కరోనా సోకినట్లు అర్థం.

ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య ఇంకెంత పెరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఏపీలో స్కూళ్లను యధావిధిగా కొనసాగిస్తున్నారు. దీనిపై తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చిత్తూరు, విశాఖల్లో కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఒక్క రోజే 1534 వస్తే, విశాఖ జిల్లాలో 1263 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు నైట్‌ కర్ఫ్యూ ఇవాళ్టి నుంచే అమలుకాబోతోంది. కేసుల సంఖ్య ఎక్కువ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ వేళల్లో మార్పు చేసే అవకాశాలు లేకపోలేదు.

Cover Photo– File Photo