ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నయ్..!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలు రెండు డోసులు తీసుకోవడం పాటు పలు జాగ్రత్తలు పాటిస్తుండటంతో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 11, 2021 / 01:36 PM IST

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలు రెండు డోసులు తీసుకోవడం పాటు పలు జాగ్రత్తలు పాటిస్తుండటంతో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కువ గా కేసులున్న జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమై, నివారణ చర్యలు చేపడుతోంది. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తూ కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు మాస్కులు పంపిణీ చేస్తూ, టీకా ఇస్తూ కేసులు తగ్గేలా యుద్ద ప్రతిపాదికన పనిచేస్తోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ మంచి ఫలితాలు ఇస్తుండటం.. మరోవైపు జనాలు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటుండంతో రికార్డుస్థాయిలో కేసులు తగ్గుతున్నాయి.

పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో వెయ్యిలోపే కేసులు నమోదు అవుతుండగా, ఏపీలో మాత్రం విరుద్దంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాకపోకలు ఎక్కువ కావడం, కొన్నిచోట్లా జనాలు గుంపులుగుంపులుగా తిరుగుతుండటంతో వ్యాధి తీవ్రత అలాగే ఉంటుంది.

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8,000 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 24 గంటల్లో 810 మంది రికవరీ కాగా, నలుగురు మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలో 24 గంటల్లో 151 కొత్త కేసులు వెలుగు చూడగా, అనంతపురంలో 9, విజయనగరం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో రెండు ఇద్దరు చనిపోయారు. గుంటూరు,  కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.