Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి

Pawan Chittur

Pawan Chittur

చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుకోని అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు పవన్ కళ్యాణ్ చేరుకోగా, ఆయన రాకను చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే కాన్వాయ్ వాహనాలు వస్తున్న సమయంలో తోపులాట జరిగి, హేమలత అనే మహిళ కిందపడగా పవన్ కళ్యాణ్ కారు ఆమె కాలిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో హేమలతకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలానికి కారణమైంది. పోలీసులు, నిర్వాహకులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి, అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tragedy : మెదక్ లో దారుణం..కన్న పేగు బంధానికి మాయని మచ్చ

ఈ అపశ్రుతి మధ్య కూడా పవన్ కళ్యాణ్ తన పర్యటన కార్యక్రమాన్ని కొనసాగించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో పాటు, ఇక్కడే ఉన్న మరో మూడు ఏనుగులు కూడా శిక్షణ పొందుతున్నాయి. ఈ కేంద్రంలో అడవి ఏనుగులను కట్టడి చేసే పద్ధతులు, వాటిని శిక్షణ ఇవ్వడం, మరియు అరణ్య సంరక్షణలో కుంకీ ఏనుగుల పాత్రపై పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏనుగులకు ఆహారం తినిపించి, వాటి విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఏనుగులు పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేయడంలో ఉన్నవారిని ఆకట్టుకుంది.

Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలిమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఏనుగుల క్యాంపులో ‘గజారామం నగర వనం’కు పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా మావటీలు కుంకీ ఏనుగుల సాయంతో అడవుల్లోని కలపను ఎలా తరలిస్తారు, మదపుటేనుగులను ఎలా నియంత్రిస్తారన్నదాని ప్రదర్శనను పవన్ కళ్యాణ్‌కు చూపించారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తూ, అడవి సంరక్షణకు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ, అరణ్య జంతువుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version