Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Construction of Amaravati completed in three years: Narayana

Construction of Amaravati completed in three years: Narayana

Capital : పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. 2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందన్నారు.

ప్రపంచంలో టాప్‌5 లో ఒకటిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం అని నారాయణ గుర్తు చేశారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించాం. అయితే మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది అని వెల్లడించారు.  అసెంబ్లీనీ 250 మీటర్ల ఎత్తులో నిర్మించి….మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్‌లు డిజైన్ చేశాం. కోటీ 3 వేల చదరపు అడుగుల తో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం అని మంత్రి నారాయణ వెల్లడించారు.

గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసింది. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని పురపాలక శాఖ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్ళలో పెట్టేసింది అని విమర్శించారు.‘నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్ లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసింది. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వై నాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు.

Read Also: Lokesh Birthday : ఇది కదా లోకేష్ మానవత్వం అంటే..!!

 

  Last Updated: 24 Jan 2025, 02:57 PM IST