Viral : సత్యజిల్లాలో రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు..

వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల ఎదురుగానే ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Police Fight

Police Fight

ప్రజలెవరైనా కొట్టుకున్న , గొడవపడిన అడ్డుకోవాల్సిన పోలీస్ కానిస్టేబుళ్లు (Constables )..వారే రోడ్డుపై కొట్టుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా (Satya Sai District)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏమాత్రం రెస్ట్ ఉండడం లేదు. ఓ పక్క ఎండలు ..మరోపక్క ఎన్నికల ప్రచారంలో నేతలకు బందోబస్తు..మరొపక్క ఎక్కడిక్కడే చెక్ పోస్ట్ ల వద్ద డ్యూటీలు..ఇలా ఎక్కడ చూసిన పోలీసులే కనిపిస్తున్నారు. ఈ తరుణంలో డ్యూటీ చేయాల్సిన కానిస్టేబుళ్లు అందరు చూస్తుండగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కొట్టుకున్న ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని పిల్లిగుండ్లు చెక్​పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో భాగంగా పిల్లిగుండ్లు చెకోపోస్టులో రొళ్ల, ఆగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణస్వామి నాయక్, శివకుమార్ డ్యూటీ లు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల ఎదురుగానే ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్థానికులు ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వారిని తొసుకుంటూ కొట్టుకున్నారు. ఎవరైనా గొడవపడితే సర్ది చెప్పాల్సిన పోలీసులే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటే ఇక శాంతిభద్రతలు ఎక్కడ ఉంటాయని ప్రజలు మాట్లాడుకున్నారు. సాయంత్రం డ్యూటీ షిప్ట్ ఆలస్యమయిందనే కారణంతో శివ, నారాయణస్వామి అనే కానిస్టేబుళ్లు బాహాబాహీకి దిగినట్లు తెలుస్తుంది. పోలీసులు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

Read Also : T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే

  Last Updated: 06 May 2024, 08:35 PM IST