Site icon HashtagU Telugu

MP Raghurama : వైఎస్ విజయమ్మ కారు ప్రమాదం వెనక కచ్చితంగా ఏదో కుట్ర ఉంది…!!

Raghuramaraj

Raghuramaraj

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ…ప్రయాణిస్తున్న కారు గురువారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారన్న విషయం తెలిసి…ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

విజయమ్మ ప్రయాణించిన కారు కేవలం మూడున్నర వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి ఉంటుందని ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకేసారి పేలిపోవడం అసంభవమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నమ్మశక్యంగా లేదన్నారు. తమ సీఎం జగన్ ఎప్పుడు దుష్టచతుష్టయం అంటుంటారని…అందుకే ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలన్నారు. దీనివెనక కచ్చితంగా ఏదో కుట్ర ఉందన్నారు. ఇప్పటికే సీఎం, బాబాయ్ ను కోల్పోయారు…ఇఫ్పుడు ఇలా జరగడం బాధాకరంగా ఉందన్నారు.