Conspiracy on Amaravati : అమ‌రావ‌తిపై ఎవ‌రి కుట్ర వాళ్ల‌దే.!

అమ‌రావ‌తి మీద మ‌రోసారి  కుట్ర‌కు రంగం (Conspiracy on Amaravati) సిద్ధ‌మ‌వుతోంది. హైద‌రాబాద్ భూముల రేటు అమాంతం పెరిగే అవ‌కాశం ఉంది

  • Written By:
  • Updated On - June 27, 2023 / 04:23 PM IST

అమ‌రావ‌తి మీద మ‌రోసారి  కుట్ర‌కు రంగం (Conspiracy on Amaravati) సిద్ధ‌మ‌వుతోంది. ఏపీ రాజ‌ధాని నామ‌రూపాల్లేకుండా చేస్తే, హైద‌రాబాద్ భూముల రేటు అమాంతం పెరిగే అవ‌కాశం ఉంది. తెలంగాణ మోడ‌ల్ ను భార‌త దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి వర‌కు ఉన్న ల్యాండ్ బ్యాంక్, బ్యాంకు బ్యాలెన్స్ విలువ పెరుగుతుంద‌ని కేసీఆర్ అండ్ టీమ్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో మ‌రోసారి జ‌గ‌న్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాల‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్లో బ్లూ ప్రింట్ సిద్ధ‌మ‌వుతోందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

అమ‌రావ‌తి మీద మ‌రోసారి కుట్రకు(Conspiracy on Amaravati)

మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావాలంటే, కాపు ఓటు బ్యాంకు నిలువునా చీలిపోవాల‌ని కేసీఆర్ త‌ల‌పోస్తున్నార‌ట‌. అందుకే, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన ఐఏఎస్ , ఐపీఎస్ ల‌తో భేటీ అయ్యారు. ఆ సామాజిక‌వ‌ర్గానికి విలువైన ఐదు ఎక‌రాల భూమిని హైద‌రాబాద్ లో ఇవ్వ‌డానికి సూత్ర‌ప్రాయంగా కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రెండు గంట‌ల పాటు వాళ్ల‌తో కేసీఆర్ సంప్ర‌దింపులు జ‌రిపారు. ఇప్ప‌టికే కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్ రావును బీఆర్ఎస్ ఏపీ చీఫ్ గా నియ‌మించారు. హైద‌రాబాద్ లో ఆస్తులున్న ఏపీ కాపు లీడ‌ర్ల ద్వారా ఆ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను చీల్చ‌డానికి బ్లూ ప్రింట్  (Conspiracy on Amaravati) సిద్ద‌మ‌యింద‌ని తెలుస్తోంది.

మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయితే, అమ‌రావ‌తి ప్రాజెక్టు ముగిసిన‌ అధ్యాయ‌మే

ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కాపు సామాజిక‌వ‌ర్గం వ్య‌తిరేకంగా ఉంద‌ని గ్రౌండ్ రిపోర్ట్. జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టిన పార్టీ కార‌ణంగా ఆ వ్య‌తిరేక వ‌చ్చింద‌ని భావిస్తున్నారు. రాబోవు రోజుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి న‌ష్టం(Conspiracy on Amaravati) క‌లుగుతుంద‌ని అంచ‌నా. గంప‌గుత్త‌గా కాపు ఓటు బ్యాంకు జ‌న‌సేన‌, టీడీపీకి వెళ్ల‌కుండా కేసీఆర్ స్కెచ్ వేశార‌ని వినికిడి. ఒక వేళ చంద్ర‌బాబు సీఎం అయితే, తిరిగి అమ‌రావ‌తి ప్రాజెక్టు తెర‌మీద‌కు వ‌స్తుంది. అప్పుడు హైద‌రాబాద్ ఇమేజ్ త‌గ్గిపోతుంది. ఆ విష‌యాన్ని ప‌లుమార్లు సీఎం కేసీఆర్ మంత్రులు హ‌రీశ్‌, కేటీఆర్ లు ప‌లు ర‌కాల కోణాల‌ను నుంచి విశ్లేషించారు.

కాపు ఓటు బ్యాంకు నిలువునా చీలిపోవాల‌ని కేసీఆర్

మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయితే, అమ‌రావ‌తి ప్రాజెక్టును (Conspiracy on Amaravati) ఇక మ‌ర‌చిపోవ‌డమే. ఆ విష‌యం కేసీఆర్ కు బాగా తెలుసు. పైగా ఇవే చంద్ర‌బాబుకు లాస్ట్ ఎన్నిక‌లు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల చంద్ర‌బాబు చెప్పారు. అందుకే, ఈసారి చంద్ర‌బాబు సీఎం కాక‌పోతే, శాశ్వ‌తంగా అమ‌రావ‌తి ప్రాజెక్టు అట‌కెక్కుతుంది. ఫ‌లితంగా హైద‌రాబాద్ ప్ర‌పంచప‌టంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ కుటుంబీకులు, స్నేహితుల ఆస్తులు, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తులు, అంత‌స్తుల విలువ హైద‌రాబాద్ లో ఆకాశాన్ని తాకుతుంది. స్వామి కార్యం స్వ‌కార్యం అన్న‌ట్టు తెలంగాణకు మేలు చేసిన‌ట్టు అవుతుంది. ఏపీని శాశ్వ‌తంగా కూల్చేసిన‌ట్టు ఫోక‌స్ చేస్తే తెలంగాణ స‌మాజం భావోద్వేగాల‌ను ఓట్ల రూపంలో పొందొచ్చ‌ని ప్లాన్ చేశార‌ని సమాచారం.

Also Read : KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!

ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా టీడీపీని ఎప్ప‌టిక‌ప్పుడు టార్గెట్ చేస్తున్నారు. పొత్తులో ఉన్న జ‌న‌సేన పార్టీని వ‌ద‌ల‌కుండా వెంటాడుతున్నారు. టీడీపీతో క‌ల‌వ‌కుండా వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు కూడా మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయ ఈక్వేష‌న్లో భాగంగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు చంద్ర‌బాబును సీఎం కాకుండా చేయాల‌ని స్కెచ్ వేశారు. జ‌న‌సేన‌, టీడీపీ క‌ల‌వ‌కుండా కేసీఆర్, సోమ‌వీర్రాజు, ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతూ చంద్ర‌బాబు సీఎం కాకుండే ఉండేందుకు పావులు క‌దుపుతున్నారు. ఈ వ్యూహంలో ఎవ‌రి కుట్ర వాళ్ల‌దే. వాళ్లు ప్లాన్ స‌క్సెస్ అయితే, అమ‌రావ‌తి రాజధాని(Conspiracy on Amaravati) అనేది ముగిసిన‌ అధ్యాయ‌మే అవుతుంది.

Also Read : BRS MLAs: పడిపోయిన ఎమ్మెల్యేల గ్రాఫ్.. 40 మందికి నో టికెట్స్?