Bobbili : బొబ్బిలి లో వరుసగా వాలంటీర్ల మృతి..కారకులు ఎవరు..?

ఇలా ఒకే నెలలో ఇద్దరు మృతి చెందడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Bobbli Voul

Bobbli Voul

ఏపీ(AP)లో ఎన్నికలు (Elections) సమీపిస్తున్న తరుణంలో వరుస పెట్టి వాలంటీర్లు మృతి చెందడం మిస్టరీ గా మారింది. ముఖ్యంగా విజయనగరం(Vizianagaram
) జిల్లాలో ఈ నెలలో ఇప్పటి వరకు ఇద్దరు వాలంటీర్లు (2 Volunteers ) మృతి చెందారు. ఈ నెల 1 న ఓ వాలింటీర్ (Volunteer ) మృత దేహం రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో లభించింది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మరో వాలంటీర్ నేడు బావిలో శవమై కనిపించాడు. ఇలా ఒకే నెలలో ఇద్దరు మృతి చెందడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

బొబ్బిలి పట్టణంలోని 10 వార్డ్​ వాలంటీర్​గా పనిచేస్తున్న కిలారి నాగరాజు (Nagaraju) ఈ నెల 01 న అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. నగర సమీపంలోని రైలు పట్టాలపై నాగరాజు మృత దేహం లభించింది. నాగరాజు సోదరుడు రవి సైతం గతంలో 10 వార్డు వాలంటీర్​గా విధులు నిర్వహించేవాడు. అయితే, రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, రవి సోదరుడైన నాగరాజును అధికారులు 10 వార్డు వాలంటీర్ గా నియమించారు. నాగరాజు కేసును సైతం పోలీసులు అనుమానిత మృతిగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే 15వ వార్డు వాలంటీర్​గా పనిచేస్తున్న ఆలబోను వెంకట సాయి రామకృష్ణ (Sai Ramakrishna) (24) సోమవారం అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. మూడు రోజులు క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాలేదు. అతని ఫోన్​కు సైతం పనిచేయలేదు. ఆందోళన చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులకు వెతకడం ప్రారంభించారు. సోమవారం రాణిగారి తోట సమీపంలోని నేలబావిలో రామకృష్ణ మృతదేహం లభించింది. వెంకట సాయి రామకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా 15వ వార్డులో వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణది హత్యా లేదా ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసారు. ఇలా వరుసగా బొబ్బలి పట్టణంలో వాలంటీర్లు మృతి చెందడం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వీరు ఎందుకు చనిపోతున్నారు..? వీరు ఆత్మహత్య చేసుకుంటున్నారా..? ఎవరైన చంపి..ఇలా ఆత్మహత్య ల సృష్టిస్తున్నారా..? అనేకోణంలో అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Sabja Seeds: సబ్జా గింజలే కదా అని లైట్ తీసుకుంటున్నారా.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో?

  Last Updated: 25 Mar 2024, 11:08 PM IST