AP Congress : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఫిక్స్..

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 01:08 PM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తుంది. ఇప్పటీకే టిడిపి – జనసేన (TDP-Janasena Alliance ) పొత్తు ఖరారు కాగా..వీరితో బిజెపి కూడా జత కట్టబోతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైంది. సీపీఎం, సీపీఐ (COngress – CPI CPM Alliance ) నేతలతో చర్చల అనంతరం ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. అధికార పార్టీని ఢీకొట్టాలంటే కలిసి పోరాడాలని షర్మిల చెప్పుకొచ్చారు.

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్​లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ ఇతర నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చలు జరిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా కూటమి (INDIA Alliance)’లో వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో, పొత్తులపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

భేటీ అనంతరం షర్మిల మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యేక హోదా తెస్తాం – అధికారం ఇవ్వండని జగన్‌ అన్నారని, బీజేపీ మెడలు వంచుతామన్న జగన్‌, ఒక్క పోరాటం కూడా చేయలేదని గుర్తు చేశారు. హోదా కోసం కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అన్నారు. హోదా ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే ఏపీకి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేదని షర్మిల పేర్కొన్నారు. పోలవరం విషయంలో కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. ఇక 26న అనంతపురంలో కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ సభకు లెఫ్ట్ పార్టీలకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.

Read Also : MLA Lasya Nanditha Last Rights : అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు