YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
ఆంధ్ర రత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. జనవరి 24 నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా షర్మిల జనవరి 23 నుండి అన్ని జిల్లాల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 31 వరకు సమావేశాలు కొనసాగుతాయి అని ఏపీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రతి రోజు మూడు జిల్లాలు కవర్ కవర్ చేయనున్నారు. ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.
సోమవారం ఏపీసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం షర్మిల మంగళవారం ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన పర్యటనను ప్రారంభించి జనవరి 31న కడప జిల్లా ఇడుపులపాయలో ముగించనున్నారు. ఆమె ప్రతిరోజూ రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం 25 జిల్లాలను కవర్ చేయనున్నారు. జనవరి 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతోపాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, 25న పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. జనవరి 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, జనవరి 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, జనవరి 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. జనవరి 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ జిల్లాలు, ఆ తర్వాత జనవరి 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, 31న నంద్యాల, కడప జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు
గత 10 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులను తిరిగి పార్టీలోకి ఆకర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేసిన షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమాకు మహేశ్ రెడీ, ఇదిగో క్రేజీ అప్డేట్