Site icon HashtagU Telugu

AP Congress : ఏపీ ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో బరిలోకి దిగబోతున్న కాంగ్రెస్

Tulasireddy Ap Cng

Tulasireddy Ap Cng

ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు బిజెపి , టీడీపీ , జనసేన , వైసీపీ పార్టీలు మాత్రమే బరిలో ఉండబోతున్నాయని అంత భావించారు. కానీ ఇప్పుడు వాటితో పాటు కాంగ్రెస్ సైతం బరిలోకి దిగబోతుంది.

ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల..ప్రస్తుతం తన దూకుడు కనపరుస్తున్నారు. అధిష్టానం సైతం ఏపీ ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలతో ఆకట్టుకుందో..ఇప్పుడు అదే విధంగా ఏపీలోనూ సరికొత్త వ్యూహాలతో అధికారం చేపట్టాలని చూస్తుంది. తాజాగా పీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి ఎన్నికల బరిలో రచిస్తున్న వ్యూహాల గురించి చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల కోసం తాము పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా తెలిపారు.

ఆ పంచముఖ వ్యూహాల విషయానికి వస్తే..

1. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమరిచి చెప్పడం
2. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం
3. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెప్పడం
4. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పడం
5. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపరచడం అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఆరు సూత్రాల విషయానికి వస్తే..

1. రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ
2. రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా
3. నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 6 వేలు ఆర్థిక సహాయం
4. ప్రత్యేకహోదా అమలు
5. రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజి అమలు
6. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి చేయడంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అని వివరించారు.

Read Also : Medaram : ఆధార్ కార్డు ఉంటేనే ‘బంగారం’ అమ్మబడును