Site icon HashtagU Telugu

Chinta Mohan : అప్పుడు చిరంజీవిని సీఎంను చేసి ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఈ ప‌రిస్థితి ఉండేది కాదు..

Congress Leader Chinta Mohan Sensational comments on Chiranjeevi goes Viral

Congress Leader Chinta Mohan Sensational comments on Chiranjeevi goes Viral

కాంగ్రెస్(Congress) సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్(Chinta Mohan) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఏపీ(AP)ని రెండు రాష్ట్రాలుగా విడ‌దీసి కాంగ్రెస్ పార్టీ త‌ప్పు చేసింద‌ని అన్నారు. ఆ త‌ప్పుడు నిర్ణ‌యం కార‌ణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ‌తిన్న‌ద‌ని అన్నారు. ప్ర‌స్తుతం, క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత కాంగ్రెస్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి టార్గెట్‌గా చింతా మోహ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డాన్ని ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు చేశారు. వై.ఎస్. రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోయిన త‌రువాత చిరంజీవిని సీఎంగా చేసి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాద‌ని అన్నారు. కిర‌ణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేసి కాంగ్రెస్ పెద్ద‌లు త‌ప్పు చేశార‌ని, ఇప్పుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీ కండువా క‌ప్పుకున్నాడ‌ని విమ‌ర్శించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా చింతా విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు కాదు.. తొందరిబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అమిత్ షా, నడ్డాతో ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని ప్ర‌శ్నించారు. టీడీపీకి ఓటువేస్తే బీజేపీకి ఓట్లు వేసిన‌ట్లేన‌ని అన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని, ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 124 అసెంబ్లీ స్థానాల్లో, 17 ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని జోస్యం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే సీఎంగా కాపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం జ‌రుగుతుంద‌ని అన్నారు. కాపుల‌కు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు, మిగిలిన కులాల వారికి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు సీఎంగా అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పారు.

నాలుగు సంవ‌త్స‌రాల వైసీపీ పాల‌న‌లో ఏపీ జైలు, బెయిళ్లు, హత్యలు, ఆత్మహత్యల్లో మాత్ర‌మే అభివృద్ధి సాధించింద‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ త్ప‌పుడు నిర్ణ‌యాల‌తో ఏపీలో పేదవాడు అకలితో అల్లాడుతున్నాడని అన్నారు. అమిత్ షా, జేపీ న‌డ్డాలు ఏపీకి వ‌చ్చి అబద్దాలు చెప్పార‌ని విమ‌ర్శించారు. దీంతో చింతా మోహన్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

Also Read : Sapthagiri : టీడీపీలోకి నటుడు, కమెడియన్ సప్తగిరి.. అక్కడ్నుంచి పోటీ చేస్తానంటూ..