వైస్సార్ కుటుంబం (YSR Family)లో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Security for Sharmila)కు భద్రత పెంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్‌ల బదులు 4+4 గన్‌మెన్‌ను అందించాలని వారు అభ్యర్థించారు. తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించబడిందని, అదే భద్రతా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో ఆమె కీలక నాయకురాలిగా పనిచేస్తుండటంతో, భద్రత అవసరమని, ముఖ్యమైన కార్యక్రమాలకు సురక్షితంగా ఉండటానికి ఆమెకు తగిన రక్షణ కల్పించాలని వారు అభ్యర్థించారు.
జగన్ – షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదం వైస్సార్ మరణం తర్వాత తెరపైకి వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం అనుభవించిన సమయంలో సాంప్రదాయక కుటుంబ సమైక్యత కనిపించినా, ఆయన మరణంతో ఆస్తుల కేటాయింపు, వాటి నిర్వహణ వంటి అంశాలు ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. ఆస్తుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై షర్మిల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదానికి దారితీసింది. కుటుంబ ఆస్తులపై షర్మిల తనకు రావాల్సిన వాటాను ఇవ్వాలని కోరగా..జగన్ మాత్రం ఇవ్వనని చెప్పడం తో గొడవలు తారాస్థాయికి చేరాయి. రీసెంట్ గా తల్లి , చెల్లికి నోటీసులు ఇవ్వడం మరింత వివాదానికి చేరింది. ఈ గొడవలపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బహిరంగ లేఖ రాసారు.
Read Also : Raj Pakala : జన్వాడా ఫామ్ హౌస్‌లో రాజ్ పాకాలతో కలిసి పోలీసుల తనిఖీలు