గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) 3 రోజుల కస్టడీ (Custody) ముగిసిన తర్వాత పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వంశీ మేజిస్ట్రేట్ ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌పై నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. తాను కూడా నార్కో టెస్టు(Narco test)కు సిద్ధమని తెలిపారు. తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరితమై ఉండొచ్చని, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటే సమగ్ర విచారణ అవసరమని వంశీ వ్యాఖ్యానించారు.
Kannappa New Poster : ఒకే ఫ్రేమ్ లో అందర్నీ దింపేసి కన్నప్ప
కస్టడీలో ఉన్న సమయంలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ ఆరోపించారు. విచారణ సమయంలో అనేక ప్రశ్నలకు సంబంధం లేకుండా తన గత రాజకీయ జీవితం, వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించినట్టు వెల్లడించారు. నిజమైన న్యాయం జరగాలంటే కేవలం తనను మాత్రమే కాకుండా, ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌ను కూడా కఠినంగా పరీక్షించాలని వంశీ అన్నారు. ఒకవేళ నార్కో టెస్ట్ చేస్తే అసలు హోదా ఎవరిదో, నిజంగా కుట్ర జరిగినదా లేదా అనేది బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు.
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రుణాలిచ్చే బాంకులకు ఇది శుభవార్తే!
ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వంశీపై కేసు నమోదైనప్పటి నుండి ఆయనపై పోలీసుల దర్యాప్తు, విచారణ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత హీట్ పెంచే అవకాశం ఉంది. సత్యవర్ధన్‌పై నార్కో పరీక్షలు నిర్వహించాలనే వంశీ డిమాండ్‌పై ప్రభుత్వం, పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.