ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే సభలో రచ్చ మొదలైంది. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మాణాలను స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో గొడవ ప్రారంభమైంది. జాబ్ క్యాలెండర్, జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని TDP సభ్యులు పట్టుబట్టడంతో ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చింద్దామని చెప్పారు స్పీకర్.
దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా TDP సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాగా వెల్ దగ్గరకు దూసుకెళ్లిన టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. TDPసభ్యుల నినాదాల గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొసాగుతున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన స్పీర్ ను కోరారు.