Kanaka Durga Temple : దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం – దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవెన్

ద‌స‌రా ఉత్స‌వాల‌కు వ‌చ్చే భక్తుల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామ‌ని దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 06:53 PM IST

ద‌స‌రా ఉత్స‌వాల‌కు వ‌చ్చే భక్తుల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామ‌ని దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు. ఉత్స‌వాల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనం కల్పిస్తామ‌ని.. గత అనుభవం దృష్టిలో పెట్టుకుని అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈనెల 15వ తేది నుండి 23వ తేది వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాధి మంది భక్తులు అమ్మవారి దర్శనానికి త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్రతి రోజు దాదాపు 50 నుండి 60 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉటుందని కరికల్ వలవెన్ తెలిపారు. ఈ నెల 20వ తేదిన మూల నక్షత్రం రోజు లక్ష 50 నుండి 2 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారని అంచనా వేయడం జరిగిందన్నారు.

కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుండి క్యూ లైన్లు, భవానిపురం నుండి వచ్చే భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్ హెడ్ వాటర్ వ‌ర్క్స్‌ నుండి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో కెనాల్ రోడ్డులోని వినాయక గుడి వద్ద నుండి భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు మోడల్ గెస్ట్ హౌస్ ఎదురుగా కొండ పక్క నుండి టోల్గేట్ మీదగా ఇంద్రకీలాద్రి పై కి భక్తులు చేరుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో క్యూలైన్లను మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ఎడమ వైపు కు మళ్లించి ఫ్లై ఓవర్ కింద నుండి ఫుట్ ఓవర్బ్రి డ్జి పై నుండి ఘట్ రోడ్డు మీదగా కొండపైకు చేరుకునేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కుమ్మరిపాలెం నుండి కొండపైకి చేరుకునే క్యూలైన్లను కూడా టోల్ గేట్ వద్ద కూడి వైపుకు మళ్లించి ఫుట్ఓ వర్ బ్రిడ్జి పై నుండి ఘాట్ రోడ్డు మీదగా క్యూ లైన్లో కొండపైకి చేరుకునేలా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుట్ ఓవర్ బ్రిడ్జిల క్రింద నుండి కేవలం అత్యావసర వాహనాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులను మాత్రమే అనుమతించడం జరుగుతుందని మిగిలిన వాహనాలు ప్లై ఓవర్ మీదగా కుమ్మరిపాలెం వైపు నుండి గాలి గోపురం ఘాట్ రోడ్డు మీదగా కొండ పైకి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు . సుమారు గంట నుండి గంటన్నర లోపు భక్తులు అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేలా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం కల్పిస్తున్నామని, క్యూలైన్లలో త్రాగునీటి సరఫరాకు 30 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. క్యూలైన్లలోని చిన్నారులకు బిస్కెట్లు, పాలను అందించేలా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు లడ్డు ప్రసాదములు అందుబాటులో ఉండేలా 12 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Also Read:  Jagannath Temple: జనవరి 1 నుంచి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్

కొండ దిగువున కనకదుర్గ నగర్ నందు భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పుణ్య స్నానాలను అంచరించేందుకు సీతమ్మవారి పాదాలు, దోభి ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, దుర్గా ఘాట్ జల్లు స్నానా ఘట్టాలు ఏర్పాటు చేయడంతో పాటు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల తలనీలాలు సమర్పించుకునేందుకు 250 మంది నాయి బ్రాహ్మణులతో ప్రత్యేక కేశఖండనశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండపైన, దిగువున, ఘాట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 15 మెడికల్ క్యాంపులు ఏర్పాలు చేసి అత్యవసర మందులను, వియంసి, ఓం టర్నింగ్ వద్ద వైద్య సేవ‌లు అందుబాటులో ఉంచనున్నామన్నారు. అన్ని ఘాట్ల వద్ద స్విమ్మర్లను ఏర్పాటు చేయనున్నామని, 1500 మంది పరిశుధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మోడల్ గేస్ట్ హౌస్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, దేవాదాయ, తదితర శాఖల అధికారులతో నిరంతరం పర్యవేక్షించి ఎప్పటికప్పుడు
తగు సూచనలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.