Complaint Against Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Complaint Against Madhav)పై పోలీసులకు మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల విషయంలో మాధవ్ అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు కంప్లైంట్ చేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఆమె సీపీకి అందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని సీపీ ఆమెకు హామీ ఇచ్చారు.
ఇకపోతే వైఎస్సార్‌సీపీకి మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం కూడా చేశారు. తాను రాజకీయాల్లో కచ్చితంగా కొనసాగుతానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Yama Dwitiya 2024 : అపమృత్యు దోషం తొలగేందుకు యముడు చెప్పిన సీక్రెట్.. రేపే ‘యమ ద్వితీయ’
వాసిరెడ్డి పద్మ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి ఖాళీ అయింది. ఆ పదవి తనకు వస్తుందని ఆమె ఆశించారు. కానీ అలా జరగలేదు. ఎన్నికలకు ముందు కూడా ఎమ్మెల్యే సీటు ఇస్తారనే మహిళా కమిషన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమె వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.