Margadarsi Chit: జ‌గ‌న్ కు తండ్రి `మార్గ‌ద‌ర్శి`నం! ఉండ‌వ‌ల్లి సంబరం!!

మూడు రోజులుగా ఏపీలోని చిట్ ఫండ్స్ మీద రిజిస్ట్రేష‌న్ శాఖ త‌నిఖీలు చేస్తోంది. ఆ రాష్ట్రంలోని క‌పిల్ చిట్ ఫండ్స్, శ్రీరామ్‌, మార్గ‌ద‌ర్శి త‌దిత‌ర ప్ర‌ముఖ సంస్థ‌ల రికార్డుల‌ను ప‌రిశీలిస్తోంది. అయితే, ఈ త‌నిఖీల‌న్నీ మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ ను ఇరుకున పెట్ట‌డానికి ఏపీ సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన ఎత్తుగ‌డగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి తేల్చారు.

  • Written By:
  • Updated On - November 19, 2022 / 02:34 PM IST

మూడు రోజులుగా ఏపీలోని చిట్ ఫండ్స్ మీద  కంపెనీల‌ రిజిస్ట్రేష‌న్ శాఖ త‌నిఖీలు చేస్తోంది. ఆ రాష్ట్రంలోని క‌పిల్ చిట్ ఫండ్స్, శ్రీరామ్‌, మార్గ‌ద‌ర్శి త‌దిత‌ర ప్ర‌ముఖ సంస్థ‌ల రికార్డుల‌ను ప‌రిశీలిస్తోంది. అయితే, ఈ త‌నిఖీల‌న్నీ మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ ను ఇరుకున పెట్ట‌డానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగ‌డగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి తేల్చారు. అంతేకాదు, త‌నిఖీలు చేయించ‌డాన్ని ప్ర‌శ‌సిస్తూ మార్గ‌ద‌ర్శి మీద ఉన్న కేసును తిర‌గ‌తోడ‌డం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంటోంది.

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆయ‌న సీఎంగా ఉన్న హ‌యాంలో మార్గదర్శి సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. అక్రమాలపై కేసులు పెట్టారు. వాటిని స‌వాల్ చేస్తూ రామోజీరావు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వైఎస్ మ‌ర‌ణం త‌రువాత ఆ కేసులు దాదాపుగా బుట్ట‌దాఖ‌లు అయ్యాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజాగా జగన్ మోహన్ రెడ్డి వాటి దుమ్ముదులిపారట‌. రాష్ట్రంలోని అన్ని చిట్ ఫండ్స్ మీద త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు. కానీ, టార్గెట్ మాత్రం మార్గ‌ద‌ర్శి అంటూ ప‌రోక్షంగా ఉండ‌వ‌ల్లి తేల్చేశారు.

Also Read:  Vijay Sai Reddy: పై నుంచి కోడెల పిలుస్తున్నాడా? చంద్ర‌బాబు పై సాయిరెడ్డి ట్వీట్

ఇటీవ‌ల జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని నిద్ర‌లేకుండా రామోజీ గ్రూపు నుంచి వెలువడుతోన్న ఈనాడు చేస్తుంద‌ని వైసీపీ వ‌ర్గాల మంట‌. ప్ర‌తిగా మార్గదర్శి మీద సీఎం జగన్ టార్గెట్ చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఆ విష‌యాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి సూచాయ‌గా చెప్పేశారు. కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ మార్గ‌ద‌ర్శి సంస్ధలపై నమోదైన కేసులో ప్ర‌భుత్వం ఇంప్లీడ్ కావడాన్ని ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. మార్గదర్శిపై జగన్ సర్కార్ దూకుడును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడుతున్నారు. ధైర్యంగా మార్గదర్శి మీద తనిఖీలు నిర్వహించిందని, మార్గదర్శి కేసు లా విద్యార్ధుల కేసు స్టడీకి ఉపయోగపడుతుందని ఆయ‌న చెబుతున్నారు.

గతంలో సుప్రీంకోర్టులో ఉన్న మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని ఉండవల్లి పలుమార్లు కోరినా జగన్ స్పందించలేదు. తాజాగా ఈనాడులో జగన్ సర్కార్ పై వ్య‌తిరేక న్యూస్ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. డిసెంబర్2న సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణ జరగబోతోందని మాజీ ఎంపీ ఉండవల్లి వెల్లడించారు. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీ చెప్పారని, డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని మ‌రోసారి రాద్థాంతం చేయ‌డానికి జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్ సిద్ధం అయింది. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం నేడు జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వాలు మార్గ‌ద‌ర్శి అంశాన్ని రాజ‌కీయ కోణం నుంచి చూడ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం!