Site icon HashtagU Telugu

Chandrababu Quash Petition : రేపు సుప్రీం కోర్ట్ లో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ఫై విచారణ

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

ఏపీ హైకోర్టు కొట్టివేసిన చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ఫై రేపు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu ) ను అరెస్ట్ చేసి రిమాండ్ లో విధించిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు లో దాఖలు చేసారు..దీనిపై విచారించిన కోర్ట్..క్వాష్ పిటిషన్‌ ను డిస్మిస్ చేసింది.

దీంతో చంద్రబాబు తరుపు లాయర్లు సుప్రీం కోర్ట్ లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేయగా..ఈ పిటిషన్ ఫై సుప్రీం కోర్ట్ (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ (CJI DY Chandrachud) ధర్మాసనం అనుమతిచ్చింది.

చంద్రబాబు కేసును సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Senior Council Siddharth Luthra) సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. అయితే రేపు మెన్షన్ చేయాలని సీజేఐ చంద్ర సూచించారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి..ఎన్ని రోజులు అవుతుందని.. సీజేఐ అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని చంద్రబాబు తరుపు లాయర్ లూథ్రా తెలిపారు. దీంతో రేపు (మంగళవారం) మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సీజేఐ సూచించారు.

Read Also : TSPSC -Group 1 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్