Vijayawada: విజయవాడలో నీటి సంక్షోభం

విజయవాడ నగరంలోని గుణదల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత నాలుగు రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు .కృష్ణానది నుంచి పలు కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం

Published By: HashtagU Telugu Desk
Vijayawada

Vijayawada

Vijayawada: విజయవాడ నగరంలోని గుణదల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత నాలుగు రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు .కృష్ణానది నుంచి పలు కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం భారీగా పడిపోవడంతో మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 17 నుంచి రోజుకు ఒక్కసారైనా కుళాయి నీరు అందడం లేదని గుణదల నివాసులు వాపోతున్నారు.

అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నా అవి సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వాటర్ ట్యాంకర్ కోసం ఎదురుచూడడం మాకు రోజువారీ దినచర్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గంటల తరబడి క్యూలో వేచి ఉన్న తర్వాత కూడా కేవలం మూడు నుండి నాలుగు బకెట్‌లు మాత్రమే లభిస్తున్నాయి అని చెప్తున్నారు. కుళాయి సరఫరా నిలిచిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణాలో నీటిమట్టం భారీగా పడిపోయింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రకాశం బ్యారేజీలో ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం, నీటిమట్టం తక్కువగా ఉండడం వల్ల కొన్ని కాలనీలకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతున్నాం అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి సరఫరా సామర్థ్యం సగటున 180 ఎంఎల్‌డి నుండి రోజుకు 150 మిలియన్ లీటర్లకు తగ్గిపోయిందని ఆయన వివరించారు.

పులిచింతల డ్యాం నుంచి నీటిని తీసుకుంటున్నప్పటికీ ప్రకాశం బ్యారేజీ వద్ద తగినన్ని నీటి మట్టాలను నిర్వహించలేకపోతున్నామని, తక్కువ స్థాయిల కారణంగా నీరు బురదగా ఉందని, వీఎంసీ ఫిల్టర్ బెడ్‌ల సామర్థ్యం తగ్గిపోయిందని ఆయన అన్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ప్రజలు సహకరించాలని పుండ్కర్ కోరారు. నీటి ట్యాంకర్ల అవసరం ఉన్న నివాసితులు 8181960909 వాట్సాప్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

Also Read: Na Samiranga King Size Hit : నా సామిరంగ నాగార్జున ‘కింగ్’ సైజ్ హిట్..!

  Last Updated: 22 Jan 2024, 05:28 PM IST