Collectors Conference : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజన్, జిఎస్‌డిపి గురించి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 11:40 గంటల నుంచి వాట్సాప్ గవర్నెన్స్, ఆర్‌టిజిఎస్‌పై ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇస్తారు. అనంతరం గ్రీవెన్స్ రెసిడెన్షియల్ స్టేటస్‌పై చీఫ్ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇస్తారు.
Read Also: SBI- HDFC: ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 వచ్చేస్తుంది!
జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యలు, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై తొలి రోజు చర్చించనున్నారు. ఇంతకు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సాధించిన ప్రగతిపై సమీక్ష చేయనున్నారు. తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం భూముల సర్వే గురించి సిసిఎల్‌ఎ ప్రెజెంటేషన్ ఇస్తారు. అనంతరం సీజనల్ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రెజెంటేషన్ ఆయా శాఖల సెక్రటరీలు ఇవ్వనున్నారు. తొలుత మంచినీటి సమస్య, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల గురించి జలవనరులశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎక్స్ అఫీషియో చీఫ్ స్పెషల్ సెక్రటరీ చెరువులు నింపడం గురించి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
అనంతరం పశుసంవర్ధకశాఖ, వేసవిలో ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపాధిహామీ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు గురించి వివరిస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మంచినీటి సమస్యపై మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులు గురించి విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రూప్‌టాప్ సోలార్, పిఎం సూర్యఘర్, గ్రీన్ కవర్, నగర వనం, ఫారెస్ట్ క్లియరెన్స్ (మేజర్ ఫారెస్ట్) ఎకో టూరిజం గురించి కలెక్టర్లకు సిఎస్ వివరిస్తారు. సాయంత్రం సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, పి4 గురించి ప్లానింగ్ సెక్రటరీ వివరించనున్నారు. వీటితో పాటు 2025-26 జిల్లాల్లో చేపట్టనున్న యాక్షన్ ప్లాన్, 15 శాతం గ్రోత్ రేట్ గురించి వివరించనున్నారు. రెండోరోజు సమావేశంలో లా అండ్ ఆర్డర్ గురించి డిజిపి వివరిస్తారు. ఇక, ముగింపు సందేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.
Read Also: Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు