Cock Fight : గోదావ‌రి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల‌కు సిద్ధ‌మైన బ‌రులు.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహ‌కులు

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:44 AM IST

సంక్రాంతి అంటేను ముందుగా గుర్తొచ్చేంది కోడి పందాలు.. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయ‌లు పందెం రాయుళ్ల చేతులు మారుతాయి. కోడి పందాల‌కు గోదావ‌రి జిల్లాల్లో నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా బ‌రులు సిద్ధంచేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున పందెం బరులు రెడీ చేశారు. 30 నుంచి 40 ఎకరాల పరిధిలో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. అయితే కోడి పందాల‌కు ఎలాంటి అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్తున్నారు. పందాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని పోలీసులు హెచ్చరించారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాల బ‌రుల‌ను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. బ‌రులు స్థ‌లాల యజమానులపై కేసులు బనాయించేందుకు పోలీసులు సిద్ధ‌మైయ్యారు. అయితే నిర్వాహ‌కులు మాత్రం తాము కబడ్డీ, బ్యాడ్మింటన్ తదితర సంప్రదాయ క్రీడల నిర్వహణకు మాత్రమే మైదానాలు సిద్ధం చేస్తున్నామ‌ని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కోడిపందాల నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని పరిరక్షణ సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకోవడంతో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహా పాలకులు కోడిపందాల నిర్వహణకు సిద్ధం చేసిన మైదానాలను ధ్వంసం చేయాలని అధికారుల‌కు కఠిన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని గ్రామాల్లో కూడా స్థానికులు కోడిపందాల‌ను నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని తీర్మానాలు చేయ‌డంతో నిర్వాహకులు సాంప్రదాయ క్రీడ అయిన కోడిపందాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ స్థలాల కోసం వెతుకుతున్నారు. వెంప గ్రామం ఒకప్పుడు కోడిపందాల నిర్వహణకు ప్రసిద్ధి చెందింది. సంక్రాంతి సీజన్‌లో పలువురు సెలబ్రిటీలు ఇక్క‌డి వ‌స్తారు. ఇక్క‌డ పందాల‌పై కోట్ల రూపాయ‌ల బెట్టింగ్ జ‌రుగుతుంది. అయితే కోర్టు ఆదేశాల కారణంగా గత మూడేళ్లుగా కోడిపందాలను పోలీసులు అనుమతించడం లేదు. అయితే గతేడాది డేగాపురం గ్రామంలో నిర్వాహకులు కోడిపందాలను నిర్వహించారు. అయితే ఈ గ్రామంలో కోడిపందాలపై కోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. నిర్వాహకులు ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి బ‌రిని మార్చిన‌ట్లు తెలుస్తుంది.

Also Read:  DP : రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తా.. టీడీపీతోనే స్వర్ణయుగం – టీడీపీ అధినేత చంద్ర‌బాబు

గత సంవత్సరం కూడా కొణితివాడ గ్రామంలో కోడిపందాలు జరిగాయి. కానీ ఈ మైదానంలో జూదగాళ్లకు వసతి కల్పించడానికి స్థ‌లం లేకపోవ‌డంతో నిర్వాహ‌కులు ప్రత్యామ్నాయ స్థలం కోసం చూస్తున్నారు. ఈ సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లాలోని తేతలి, పెద అమిరం, పాలకొల్లులో మూడు చోట్ల కోడిపందాల పోటీలు జరగనున్నాయి. భోగి పండుగకు మూడు రోజుల ముందు నుంచే కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు నిర్వహించేందుకు మైదానాలు సిద్ధం చేస్తున్నారు. భోగి రోజు అయితే కోడిపందాలకు మైదానం వేదిక కానుంది. ఇటు వీరవాసరం మండలంలో కోడిపందాల కోసం రెండు మైదానాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. అధికారి పార్టీ ఒక బ‌రిని సిద్ధం చేస్తుండ‌గా.. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మ‌రో బ‌రిని సిద్ధం చేస్తున్నట్లు మరో సమాచారం.