Cock Fight : గోదావ‌రి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయ‌లు

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 06:28 AM IST

గోదావ‌రి జిల్లాల్లో కోడిపందాలు జోరుగాసాగాయి. రెండోరోజులు తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కోట్ల రూపాయ‌లు చేతులు మారాయి. పోలీసులు ఆంక్ష‌లు విధించిన పందెం రాయుళ్లు లెక్క చేయ‌లేదు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వద్ద కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల బ‌రిని ధ్వంసం చేసి పందెంరాయుళ్ల‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో కోడిపందాల మైదానంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిర్వాహకులు పరిస్థితిని అదుపు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం తీతలి గ్రామంలో కోడిపందాల పోటీకి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. పశ్చిమగోదావరి, కాకినాడలో నిర్వహించిన కోడిపందాల్లో కోట్లాది బెట్టింగ్‌లు జరిగాయి. గుండాట (పాచికలు) జూదగాళ్ల నిర్వాహకులు తమ ఆటల నిర్వహణ కోసం గెద్దనపల్లిలో రూ.75 లక్షలు వెచ్చించి మైదానాన్ని కొనుగోలు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు పెద్ద ఎత్తున కోడిపందాల్లో పాల్గొన్నారు. పెద అమిరం గ్రామంలో కోడిపందాల నిర్వాహకులు వీఐపీల కోసం బందోబస్తుతోపాటు పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పందెం బ‌రుల్లో మ‌ద్యం ఏరులైపారుతుంది.

Also Read:  Coconut Water: కొబ్బరి నీళ్లు మంచివే అని తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?