CM YS Jagan: లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) తన విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ ద్వారా స్వరాష్ట్రానికి చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cm YS Jagan

Ap Cm Jagan

CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) తన విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ ద్వారా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తన పిల్లలకు కలిసేందుకు లండన్ (London Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానం గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

విదేశీ పర్యటనను ముగించుకుని ఏపీకి తిరిగొస్తున్న సీఎం జగన్‌కు ఏపీ మంత్రులు జోగి రమేష్‌, విశ్వరూప్‌, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు, పార్థసారథి, కైలే అనిల్, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి నందిగామ సురేష్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. వైఎస్‌ జగన్ దంపతులు సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్‌లో చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు జగన్ దంపతులు అక్కడికి వెళ్లారు.

Also Read: Matsya 6000 : సముద్రయాన్ కోసం ‘మత్స్య 6000’ రెడీ.. విశేషాలివీ ?

నేడు జగన్ రాష్ట్రంలోని పరిస్థితులు, శాంతిభద్రతల మీద సమీక్ష నిర్వహించనున్నారు. రేపు బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్ రెండు రోజుల తర్వాత రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో టెన్షన్‌ నెలకొన్న ఈ తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం.

  Last Updated: 12 Sep 2023, 08:52 AM IST