AP CM Jagan : ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ స‌ర్వే.. ఆ 50 మందిపై…?

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ స‌ర్వే చేయించారు...

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 07:58 AM IST

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ స‌ర్వే చేయించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎంత మంది ఎమ్మెల్యేలు పాల్గోంటున్నారు. వారికి ఎదుర‌వుతున్న అనుభ‌వాల‌ను ప్ర‌తిరోజు స‌ర్వే రిపోర్టుని సీఎం జ‌గ‌న్ తెప్పించుకుంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 50 మంది ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌ని స‌మాచారం. ఎమ్మెల్యేల ప‌నితీరుపై వ‌చ్చిన నివేదిక‌ల‌ను ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్ ..ఆ ఎమ్మెల్యేల‌పై సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలమైన మంత్రులను హెచ్చరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతామని హెచ్చరించే యోచనలో ఉన్నారు.

2024 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారం చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక రూపోందిస్తున్నారు. అనేక సర్వేల ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కన్నేసి ఉంచారని.. కొత్తగా చేరిన కొంతమంది మంత్రుల పనితీరుపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవల ముగిసిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం వార్నింగ్ ఇచ్చిన తర్వాత టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు మాజీ మంత్రులతో పాటు పలువురు మంత్రులు మీడియా ముందుకు రావడం గమనార్హం. ప్ర‌తిప‌క్ష టీడీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండంటంతో అధికార పార్టీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు మాత్రం టీడీపీకి కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నారు. సీఎం జ‌గ‌న్ నేరుగా మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన త‌రువాత మాత్రం వారిలో చ‌ల‌నం క‌లిగింది. మంత్రి ప‌ద‌వి పోయిన త‌రువాత స్త‌బ్ధుగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌ళ్లీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రాబాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై తీవ్ర‌మైన ప‌ద‌జాలాన్ని వాడారు. దీంతో గుడివాడ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.