Site icon HashtagU Telugu

Andhra Pradesh: ఒబెరాయ్‌ హోటల్స్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన

Andhra Pradesh

New Web Story Copy 2023 07 09t153217.213

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సీఎం జగన్ ఈ రోజు ఏపీలో లగ్జరీ హోటల్స్ కు శంకుస్థాపన చేశారు. గత మార్చిలో ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అందులో హోటల్ చైన్ ఒకటి. ఈ రోజు ఏపీలో సదరు సంస్థ హోటల్స్ కు శంకుస్థాపన జరిగింది.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన హోటల్స్ కు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటలో విలాసవంతమైన హోటల్‌కు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. దీని ద్వారా గండికోట మరియు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు సీఎం జగన్. 500 నుండి 800 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని అందిస్తుంది అని చెప్పారు. హోటల్‌తో పాటు గండికోటలో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలని ఒబెరాయ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్‌ను అభ్యర్థించినట్లు సీఎం జగన్ తెలిపారు. మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)లో హోటల్ చైన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాలకు కొనసాగింపుగా మూడు హోటళ్లకు ఈ రోజు పునాది పడింది.

Read More: Rs 355 Crores For Personal Security : ఏడాదికి 115 కోట్లు.. ఆ బిజినెస్ మ్యాన్ పర్సనల్ సెక్యూరిటీ ఖర్చు