CM Jagan : ఎన్నికల వేళ నేతలకు జగన్ కీలక సూచనలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 12:21 PM IST

ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో నేతలకు కీలక సూచనలు (Instructions To YSRCP Leaders ) తెలియజేసారు వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM YS Jagan). ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబదించిన షెడ్యూల్ ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక ఏపీలో మే 13 న పోలింగ్ , జూన్ 04 ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో జగన్..పార్టీ నేతలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులకు సరిపడా సమయం ఉందని, ఎన్నికల షెడ్యూల్‌ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామని .. ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని జగన్ పేర్కొన్నారు. ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా ” మేమంతా సిద్ధం ” పేరుతో బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4జిల్లాలు/పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

Read Also : Aishwarya Rajinikanth: అతనితో ప్రేమలో పడిన ఐశ్వర్య రజనీకాంత్.. ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!