రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తో టీడీపీ , జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..వైసీపీ శ్రేణులు మాత్రం విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు చాలామంది ఈ పొత్తు ఫై స్పందించగా..తాజాగా సీఎం జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు.
కొద్దిసేపటి క్రితం నిడదవోలు లో ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ (YSR Kapu Nestham 4th phace) నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేసారు. ఈ సందర్బంగా ఆయన (Jagan) మాట్లాడుతూ..టీడీపీ – జనసేన పొత్తు ఫై , చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) , పవన్ కళ్యాణ్ మద్దతు (TDP Janasena alliance) వంటి అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అవినీతి కేసులో అరెస్టైన మహానుభావుడి గురించి నాలుగు మాటలు అంటూ.. ఇన్ని దొంగ తనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే. సామాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరన్నారు. నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా.. దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు ఉన్నరినై.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టే ఆలా ఉన్నారని జగన్ చెప్పుకొచ్చాడు. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడని పవన్ కళ్యాన్ కు చురకలు అంటించారు.
Read Also : Delhi : మరికాసేపట్లో లోకేష్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం
తానేం తప్పు చేయలేదని చంద్రబాబు కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. సాక్ష్యాలు ఆధారాలు చూసిన తరవాతే కోర్టు రిమాండ్‌కి పంపిందని స్పష్టం చేశారు. ఒత్తిడి చేసి మరీ సంతకాలు పెట్టించి స్కామ్ చేశారని విమర్శించారు. ఈ స్కామ్ కథంతా చంద్రబాబే నడిపారని, ఆయనను కాకుండా మరింకెవరని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.సాధారణ వ్యక్తి అవినీతికి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందో…చంద్రబాబు లాంటి వ్యక్తికీ అలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పారు. జనం సొమ్ముని దోచుకున్న వ్యక్తిని జైల్లో పెట్టకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కాపాడేందుకు కొందరు విశ్వప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఫైర్ అయ్యారు జగన్. కానీ ఆయన మాత్రం తనకేమీ తెలియదని చెప్పారని మండి పడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సూత్రధారి చంద్రబాబేనని CID నిర్ధరించిందని చెప్పారు. రూ.371 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ములాఖత్‌లో మిలాఖతై పొత్తు పెట్టుకున్న వాళ్లను ఏం చేయాలో మీరే చెప్పాలంటూ పవన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.