Site icon HashtagU Telugu

YS Jagan Comments On Chandrababu Arrest : జగన్ భయపడ్డడా..? అందుకే చంద్రబాబు అరెస్ట్ ఫై ఆలా మాట్లాడాడా…?

Cm Ys Jagan Comments On Chandrababu arrest

Cm Ys Jagan Comments On Chandrababu arrest

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS jagan Mohan Reddy) భయపడ్డడా..? ప్రస్తుతం రాష్ట్రంలో , సోషల్ మీడియా లో ఇలాగే మాట్లాడుకుంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేసి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ కేసుకు చంద్రబాబు కు సంబంధం లేదని . అసలు స్కామే జరగనికేసులో స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో వేయడాన్ని యావత్ ప్రజానీకం తప్పుపడుతుంది. ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు , పలువురు బిజినెస్ నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూ..చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల్లో రోజు రోజుకు చంద్రబాబు ఫై సానుభూతి విపరీతంగా పెరుగుతుంది. మరోపక్క జనసేన సైతం టీడీపీ కి సపోర్ట్ గా నిలువడం..రాబోయే ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగబోతున్నట్లు చెప్పడం తో..జగన్ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.

అందుకే ప్రజల్లో వైసీపీ (YCP) ఫై ఇంకా వ్యతిరేకత పెరగకముందే ప్రజల మనసులు మార్చాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు జగన్. అందుకే చంద్రబాబు అరెస్ట్ విషయంలో తమ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని..అది చట్టం చేసిన పని అని..అసలు చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను ఇక్కడ లేనని , లండన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు జగన్. ఈ మాటలు విన్న సొంత పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యంలో పడ్డారు. మొన్నటికి మొన్న నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఒక్కసారిగా మాట మార్చడానికి కారణం ఏంటీ? నిజంగా జగన్ ఆత్మరక్షణలో పడ్డారా లేకుంటే దీనికి వేరే కారణం ఏమైనా ఉందా? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైములో ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయిస్తే..అది అధికార పార్టీ కి మైనస్ అవుతుంది. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి , 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓ తలాతోకా లేని కేసులో జైల్లో పెట్టడం..ఆ తర్వాత పలువురు వైసీపీ నేతలు ఏదో సాదించామన్నట్లు బాణా సంచా కాల్చడం..స్వీట్స్ పంచుకోవడం , ప్రెస్ మీట్ లు పెట్టి ఏదో గొప్ప పని చేసామన్నట్లు చెప్పడం ప్రజల్లో పార్టీ ఫై పూర్తి వ్యతిరేకత వచ్చింది. సొంత పార్టీ లోని కొంతమంది నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేకపోయారు. ప్రజల్లో చంద్రబాబు ఫై సానుభూతి మరింత పెరిగేలా చేసింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన జగన్..పలువురు నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మీరు చేసిన పనికి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని..చంద్రబాబు ను కావాలనే అరెస్ట్ చేయించినట్లు ప్రజల్లోకి వెళ్లిందని వారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇలా రోజు రోజుకు పార్టీ ఫై వ్యతిరేకత పెరుగుతుండడం..టీడీపీ ఫై సానుభూతి పెరుగుతుండడం చూసిన జగన్..పార్టీ డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చంద్రబాబు అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధంలేదని చట్టం తన పని తాను చేసుకుంటుందనే లైన్‌లో జగన్ మాట్లాడుకొచ్చారు. తాను ఇండియాలో లేనప్పుడే చంద్రబాబు అరెస్టు జరిగిందని ఆయన ఎక్కడ ఉన్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్నట్టు మాట్లాడారు. ఇక జగన్ మాట్లాడిన తీరు ఫై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చేసిందంతా చేసి..తనకు ఏ సంబంధం లేదన్నట్లు జగన్ చెప్పుకొస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడని , ప్రజలు అన్ని చూస్తున్నారని..ఎన్నికల్లో తగిన బుద్ది చెపుతారని అంటున్నారు.

Read Also : Nara Lokesh Inner Ring Road Case : నారా లోకేష్ ఫై సీఐడీ ప్రశ్నల వర్షం..